Friday, August 8, 2025

దుర్గా భవాని స్కూల్లో విద్యార్థి ఎన్నికలు

దుర్గా భవాని స్కూల్లో విద్యార్థి ఎన్నికలు
ఈరోజు స్థానిక దుర్గా భవాని స్కూల్లో విద్యార్థి ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు అందరూ తమ ఓటు హక్కును వీవీఎంల (వోటర్ వెరిఫైయబుల్ మెషీన్స్) ద్వారా వినియోగించుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ గెల్లి రవి గారు మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపాల్ కె.వి. ప్రసాద్ మాట్లాడుతూ, భవిష్యత్తులో సమాజ సేవ చేయడానికి నాయకత్వం అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ పానుగోతు రవికుమార్, పాఠశాల ఇంచార్జ్ సరిత, ఉపాధ్యాయులు శ్రీను, రాకేష్ భాష, రాకేష్, కవిత, విజయలక్ష్మి, సౌజన్య, కరుణ, విజయలక్ష్మి కుమారి, నాగేశ్వరి, కుదభి రాధ, వ్యాయామ ఉపాధ్యాయుడు నాగు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ వినీత తదితరులు పాల్గొన్నారు.

No comments:

మనభూమి వార్త

హుజూర్ నగర్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

​హుజూర్ నగర్, మార్చి 7, 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని బాలాజీ ఫంక్...

ఎక్కువమంది చూసినా వార్త